VIL: దేశంలో 5జీ సేవల ట్రయల్స్... సరికొత్త రికార్డు నెలకొల్పిన వొడాఫోన్ ఐడియా

  • త్వరలోనే భారత్ లో 5జీ సేవలు
  • ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహణ
  • 4 జీబీపీఎస్ వేగంగా సాధించిన వొడాఫోన్ ఐడియా లిమిటెడ్
  • వేలానికి 26 గిగాహెర్జ్/మిల్లీమీటర్ స్పెక్ట్రమ్
VIL set new record in five g spectrum trials

భారత్ లో త్వరలోనే 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 5జీ సేవల ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ముందస్తు పరీక్షల్లో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) రికార్డు నెలకొల్పింది. తాజా ట్రయల్స్ లో వొడాఫోన్ ఐడియా 4 జీబీపీఎస్ వేగాన్ని అందుకోవడం విశేషం. దీనిపై వీఐఎల్ ఓ ప్రకటన చేసింది.

భవిష్యత్ లో 26 గిగాహెర్జ్/మిల్లీమీటర్ స్పెక్ట్రమ్ బ్యాండ్ ను విక్రయించనుండగా, నిర్దేశించిన బ్యాండ్ విడ్త్ లో తాజా ప్రయోగం చేపట్టారు. ఇందులో వీఐఎల్ రికార్డు వేగం సాధించిందని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ వెల్లడించారు. గాంధీనగర్ లో జరిగిన ఈ తాజా ప్రయోగంలో నోకియా కూడా పాల్గొందని, పూణేలో నిర్వహించిన ప్రయోగంలో ఎరిక్సన్ సంస్థ పాలుపంచుకుందని తెలిపారు.

కాగా, 5జీ ట్రయల్స్ గడువును కేంద్రం పొడిగించిందని జగ్బీర్ సింగ్ పేర్కొన్నారు. స్పెక్ట్రమ్ వేలం తేదీలు ఇంకా ఖరారు కాలేదని అన్నారు.

More Telugu News