Andhra Pradesh: మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

AP govt files affidavit in High Court in Amaravathi case
షార్ట్స్‌లో చూడండి
మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. రద్దు చేసిన బిల్లులను ఈ నెల 22న అసెంబ్లీ ఆమోదించిందని అఫిడవిట్ లో ప్రభుత్వం తెలిపింది. ఇదే బిల్లులను ఈనెల 23న  శాసనమండలిలో కూడా ఆమెదించామని వెల్లడించింది.

వికేంద్రీకరణ బిల్లులపై స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పాలని ఇటీవలే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లులను రద్దు చేసినట్టు రెండు బిల్లుల కాపీలను అఫిడవిట్ కు జతచేసి హైకోర్టుకు సమర్పించారు. బిల్లులను చట్ట సభల్లో రద్దు చేసిన నేపథ్యంలో... తగు ఉత్తర్వులను వెలువరించాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Amaravati
Bills
AP High Court

More Telugu News