అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించిన భారత బౌలర్‌ రాహుల్‌.. వీడియో ఇదిగో

26-11-2021 Fri 12:54
  • టీమిండియా-ఏ జట్టుతో దక్షిణాఫ్రికా-ఏ జట్టు టెస్ట్‌ మ్యాచ్ లో ఘ‌ట‌న‌
  • ఎల్బీకు రాహుల్‌ అప్పీల్
  • అంపైర్ ఔట్ ఇవ్వ‌లేదని ఆగ్ర‌హం
  • అంపైర్‌తో వాగ్వివాదానికి దిగిన వైనం
rahul fires on umpire
ద‌క్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటైన్ లో టీమిండియా-ఏ జట్టుతో దక్షిణాఫ్రికా-ఏ జట్టు టెస్ట్‌ మ్యాచ్ ఆడుతోంది. ఇందులో భార‌త బౌల‌ర్ ప్ర‌వ‌ర్తించిన తీరు విస్మ‌యానికి గురిచేసింది. రెండో రోజు ఆట‌లో భారత బౌలర్‌ రాహుల్‌ చహర్ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగి, దురుసుగా ప్రవర్తించాడు. రాహుల్ చహర్ బౌలింగ్ చేయ‌గా ఆ బంతి బ్యాటింగ్‌ చేస్తున్న క్యూషీలే ప్యాడ్‌లను తాకడంతో ఎల్బీకు రాహుల్‌ అప్పీల్ చేశాడు.

అయితే, అంపైర్ ఔట్ ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆగ్ర‌హంతో చహర్‌ తన సన్‌ గ్లాస్‌ను తీసి నేల‌పై విసిరేశాడు. అంపైర్‌తో గొడ‌వ‌ప‌డ్డాడు. అనంత‌రం మ‌ళ్లీ బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టుపై తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా-ఏ జ‌ట్టు 509 పరుగులు చేసి, పై చేయి సాధించింది.