83 మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్

26-11-2021 Fri 12:32
  • క్రికెట్ నేపథ్యంలో సాగే '83' మూవీ
  • ప్రధానమైన పాత్రలో రణ్ వీర్ సింగ్
  • ఈనెల 30వ తేదీన ట్రైలర్ రిలీజ్
  • వచ్చేనెల 24వ తేదీన సినిమా రిలీజ్
83 movie teaser released
రణ్ వీర్ సింగ్ హీరోగా '83' సినిమా రూపొందింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రికెట్ నేపథ్యంలో నడుస్తుంది. 1983లో టీమ్ ఇండియా తొలిసారిగా వరల్డ్ కప్ ను గెలుచుకుంది. అందువల్లనే ఈ సినిమాకి '83' అనే టైటిల్ ను సెట్ చేశారు. జట్టు విజయంలో కపిల్ దేవ్ కీలకమైన పాత్రను పోషించారు. ఆ అంశాన్ని ప్రధానంగా చేసుకుని నడిచే కథ ఇది.

ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను రణ్ వీర్ సింగ్ పోషించాడు. బడా బ్యానర్లు కొన్ని కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కపిల్ పాత్రను చేస్తున్న రణ్ వీర్, సహజత్వం కోసం గట్టిగానే కసరత్తు చేశాడు. తనలో కపిల్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.