shiv shankar: శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌కు హీరో ధనుశ్ రూ.10 ల‌క్ష‌ల సాయం.. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్ష‌

dhanush helps shiv shankar master
  • క‌రోనా బారిన‌ప‌డ్డ శివ శంక‌ర్ మాస్ట‌ర్
  • సాయం అందిస్తోన్న ప్ర‌ముఖులు
  • చిన్న కుమారుడు అజయ్ కృష్ణతో సంప్ర‌దింపులు

క‌రోనా సోక‌డంతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ చికిత్స తీసుకుంటోన్న విష‌యం విదిత‌మే. శివశంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబానికి సాయం చేస్తాన‌ని ఇప్ప‌టికే సినీన‌టుడు సోనూసూద్ ప్ర‌క‌టించారు. తాజాగా, హీరో ధ‌నుశ్ కూడా సాయం చేశాడు. శివశంకర్ మాస్టర్  వైద్య ఖర్చుల కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాడు.

శివశంకర్ మాస్టర్ తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు త్వరగా కోలుకోవాలని ధనుశ్ ఆకాంక్షించాడు. కాగా, శివశంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబ స‌భ్యుల్లో ముగ్గురు ఒకేసారి కరోనా బారిన పడ్డారు. ఆయ‌న‌ పెద్ద కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నారు. శివశంకర్ మాస్టర్ భార్య హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో శివ శంక‌ర్ మాస్ట‌ర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతూ ప‌లువురు ప్ర‌ముఖులు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News