న్యాయం కోసం.. అత్తారింటి మెట్ల‌పైనే 4 రోజులుగా కోడ‌లు పూజ‌లు.. వీడియో ఇదిగో

26-11-2021 Fri 11:51
  • ఒడిశాలో ఘ‌ట‌న‌
  • ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసిన భ‌ర్త‌
  • ఇంటి నుంచి పారిపోయాడ‌న్న బాధితురాలు
  • అత్తారింటి ముందే నిర‌స‌న‌గా ల‌క్ష్మీ దేవికి పూజ‌లు
 Bride stages dharna
ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. ఏడు నెల‌లు కాపురం చేసి అనంత‌రం భార్య‌ను వ‌దిలేసి, ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో అత్తారింటి మెట్ల‌పై నిర‌స‌న చేప‌ట్టింది కోడ‌లు. మెట్ల‌పైనే నాలుగు రోజులుగా పూజ‌లు చేస్తోంది. ప్రేమ పేరుతో డాక్టర్‌ సునీత్‌ సాహు మోసం చేశాడని బాధితురాలు త‌ప‌స్విని దాస్‌ చెప్పింది. త‌న‌ను అత‌డు కోర్టు సమక్షంలో పెళ్లి చేసుకున్నాడ‌ని వివ‌రించింది.

ఒడిశాలోని బరంపురంలోని బ్రహ్మనగర్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మార్గశిర గురువారం నేప‌థ్యంలో నిన్న ఆమె సంప్రదాయ వస్త్రాలు ధరించి మెట్లపైనే పండ్లు, ఫ‌లహారాలు పెట్టింది. అక్క‌డే  లక్ష్మీదేవికి పూజలు చేసి, మీడియాతో మాట్లాడింది. ఆమెకు మ‌హిళా సంఘాలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. త‌న‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు త‌న పోరాటాన్ని కొన‌సాగిస్తాన‌ని బాధితురాలు చెబుతోంది.