అందుకే ప్రభాస్ సినిమాకు పనిచేయలేకపోయాను: తమన్

26-11-2021 Fri 11:16
  • సంగీత దర్శకుడిగా ఫుల్ బిజీ 
  • చేతినిండా సినిమాలు
  • వరుసగా పడుతున్న హిట్లు 
  • ప్రభాస్ సినిమా చేయాలంటున్న తమన్  
Thaman said about Rebal movie
సెకండ్ వేవ్ తరువాత కొత్త సినిమాలు థియేటర్ల దిశగా క్యూ కడుతున్నాయి. ఎక్కువ సినిమాలకి సంగీత దర్శకుడిగా తమన్ పేరు వినిపిస్తోంది. పెద్ద హీరోలతో .. పెద్ద బ్యానర్లలతో కలిసి తమన్ పనిచేస్తున్నాడు. చిరంజీవి .. బాలకృష్ణ .. పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలందరి సినిమాలకు ఆయన పనిచేశాడు.

అయితే ఇంతవరకూ ఆయన ప్రభాస్ సినిమాకి సంగీతాన్ని అందించకపోవడం విచిత్రం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి ప్రభాస్ సినిమాలో తమన్ ఇంతవరకూ సంగీతాన్ని అందించకపోవడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రభాస్ తో కలిసి పనిచేయకపోవడానికి కారణమేదైనా ఉందా అనే సందేహం కూడా కలుగుతుంది.

తాజా ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ .. "ప్రభాస్ 'రెబల్' సినిమాకి పనిచేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమాకి సంగీతం కూడా తానే చేయాలని లారెన్స్ అనుకోవడం వలన ఆ ఛాన్స్ పోయింది. అప్పటి నుంచి ఆయనతో ఏ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. త్వరలో ప్రభాస్ సినిమాకి పనిచేసే అవకాశం వస్తుందనే భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.