ఎవరూ రూపాయి కూడా కట్టొద్దు: నారా లోకేశ్

26-11-2021 Fri 11:13
  • వైఎస్ జ‌గ‌న్ జలగలా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాడు
  • పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషనంటూ రూ.1500 కోట్లు కొట్టేసే స్కెచ్
  • అధికారంలోకి వచ్చిన వెంటనే మేం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం
lokesh slams ycp
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'ముక్కు పిండి వ‌సూలు' పేరిట 'ఆంధ్ర‌జ్యోతి' దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ వార్త‌ను ఆయన పోస్ట్ చేసి అందులోని అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఆర్థిక ఇబ్బందులతో వైసీపీ ప్ర‌భుత్వం ఇబ్బందులు ప‌డుతోంద‌ని, దీంతో ఇళ్ల లబ్ధిదారుల నుంచి  వసూళ్లకు రంగం సిద్ధం చేసిందని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా రూ.1,500 కోట్లు వ‌సూలు చేయాల‌ని లక్ష్యంగా పెట్టుకుందని అందులో చెప్పారు.  దీనిపై లోకేశ్ స్పందించారు.

'వైఎస్ జ‌గ‌న్ జలగలా ప్రజల రక్తాన్ని పీలుస్తున్నాడు. ఎన్టీఆర్ గారి హయాం నుండి వివిధ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన పక్కా ఇళ్లకు రిజిస్ట్రేషనంటూ రూ.1500 కోట్లు కొట్టేసే స్కెచ్ వేశారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా కట్టొద్దు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం' అని నారా లోకేశ్ చెప్పారు.