కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో చెట్టును బ‌లంగా ఢీకొన్న కారు.. న‌లుగురి మృతి

26-11-2021 Fri 10:32
  • కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూరులో ప్ర‌మాదం
  • ఖమ్మం నుంచి ఐదుగురు ప్ర‌యాణికుల‌తో వ‌చ్చిన కారు
  • నిద్ర‌మ‌త్తులో కారు న‌డ‌ప‌డంతోనే ప్ర‌మాదం?
accident in karimnagar
కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూరులో ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుని న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం నుంచి ఐదుగురు ప్ర‌యాణికుల‌తో వ‌చ్చిన ఓ కారు మానకొండూరులో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మ‌రొక‌రికి తీవ్రగాయాలు కావ‌డంతో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ఖమ్మం జిల్లా కల్లూరులో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఓ కుటుంబం తిరిగి క‌రీంన‌గ‌ర్ వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. మృతులు అంద‌రూ కరీంనగర్‌లోని జ్యోతినగర్ కు చెందిన వారిగా పోలీసులు చెప్పారు. మృతుల పేర్లు కె.శ్రీనివాసరావు, బాలాజీ శ్రీధర్‌, ఇందూరి జలంధర్, శ్రీరాజుగా గుర్తించారు. తెల్ల‌వారుజామున‌ నిద్ర మత్తులో కారు నడపడం వ‌ల్లే చెట్టును ఢీకొన్న‌ట్లు తెలుస్తోంది.