తిరుమల భక్తులకు శుభవార్త.. రేపు సర్వదర్శనం టోకెన్ల విడుదల

26-11-2021 Fri 08:17
  • రేపు ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల
  • తిరుమలలో వసతి టికెట్లు ఆదివారం జారీ
  • టోకెన్లు క్షణాల్లోనే అయిపోతుండడంపై సామాన్య  భక్తులకు అందని వైనం
Good news for Tirumala devotees
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. వచ్చే నెల (డిసెంబరు)కు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. అలాగే, తిరుమలలో వసతికి సంబంధించిన డిసెంబరు కోటాను ఎల్లుండి (ఆదివారం) ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు పేర్కొంది. కరోనా నేపథ్యంలో సర్వదర్శనాన్ని నిలిపివేసిన టీటీడీ ఇటీవల పునరుద్ధరించింది.

సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్‌లైన్ చేసి ప్రతి నెల నిర్దేశిత కోటా టోకెన్లను విడుదల చేస్తోంది. అయితే, సర్వదర్శనాన్ని కూడా ఆన్‌లైన్ చేయడంపై భక్తుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్న టోకెన్లు క్షణాల్లో అయిపోవడంతో సామాన్య భక్తులకు టోకెన్లు అందకుండా పోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.