తిరుపతిలో వింత.. భూమిలో నుంచి పైకి వచ్చేసిన సిమెంటు రింగుల ట్యాంకు

26-11-2021 Fri 06:30
  • భూమి లోపల సిమెంటు రింగులతో ట్యాంకు ఏర్పాటు
  • 25 రింగుల్లో 18 భూమిపైకి
  • వరదనీటి ఒత్తిడే కారణమంటున్న జనం
Cement Tank Came out from land in Tirupati
తిరుపతిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావమో, మరోటో తెలియదు కానీ భూమిలో సిమెంటు రింగులతో ఏర్పాటు చేసిన ట్యాంకు ఒక్కసారిగా పైకి వచ్చేసింది. విషయం తెలిసిన జనం పైకొచ్చిన ట్యాంకును చూసేందుకు బారులు తీరారు. ట్యాంకును శుభ్రం చేస్తున్న సమయంలో అది నెమ్మదిగా పైకి రావడం గమనించిన మహిళ  భయపడిపోయింది. ఈ ఘటనలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది.

భూమి లోపల మొత్తం 25 రింగులతో ఈ ట్యాంకును ఏర్పాటు చేయగా అందులోని 18 రింగులు పైకి వచ్చేశాయి. వీటిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలే ఇందుకు కారణమని, వదర నీటి ఒత్తిడితో రింగులు పైకి వచ్చాయని చెబుతున్నారు.