అన్నా హజారేకు యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు

25-11-2021 Thu 20:35
  • కొన్నిరోజులుగా ఛాతీలో నొప్పితో బాధపడుతున్న హజారే
  • రుబే హాల్ క్లినిక్ ఆసుపత్రిలో చికిత్స
  • రక్తనాళాల్లో అడ్డంకి
  • తొలగించిన వైద్యులు
Anna Hazare hospitalized
ఛాతీలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిపాలైన ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. అన్నా హజారే వయసు 84 సంవత్సరాలు. ఆయన గత కొన్నిరోజులుగా ఛాతీలో నొప్పితో బాధపడుతున్నారు.

దాంతో ఆయనను పూణేలోని రుబే హాల్ క్లినిక్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో ఆయన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నట్టు గుర్తించారు. అనంతరం యాంజియోప్లాస్టీ ద్వారా అడ్డంకిని తొలగించారు. ప్రస్తుతం అన్నా హజారే ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి అవుతారని రుబే హాల్ క్లినిక్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.