'స్కైల్యాబ్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

25-11-2021 Thu 19:33
  • సత్యదేవ్ హీరోగా 'స్కైల్యాబ్'
  • కథానాయికగా నిత్యామీనన్ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • డిసెంబర్ 4వ తేదీన రిలీజ్
Skylab movie lyrical video song released
సత్యదేవ్ - నిత్యామీనన్ జంటగా 'స్కైల్యాబ్' సినిమా రూపొందింది. పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన ఈ సినిమాకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ ఇది. ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, తాజాగా లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

"రారా లింగా రారా లింగా .. కథ చెబుతా కచ్చితంగా, రారా లింగా రామాలింగా ఇనుకోరా సుబ్బరంగా. పైకి సూత్తే ఎంతో సురుకు .. లోన మాత్రం లేదు సరుకు .. ఊరుమొత్తం ఇంతేనయ్యో తళుకు బెళుకు" అంటూ ఈ పాట సాగుతోంది. సానపాటి భరద్వాజ్ పాత్రో సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సీన్ రోల్డన్ ఆలపించాడు.

రాహుల్ రామకృష్ణ .. తులసి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, డిసెంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. కొంత గ్యాప్ తరువాత నిత్యామీనన్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇక ఇదే నెల 10వ తేదీన వస్తున్న 'గమనం' సినిమాలోను ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.