బాలకృష్ణ 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

25-11-2021 Thu 19:16
  • బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా 'అఖండ'
  • బోయపాటి శ్రీను దర్శకత్వం
  • ఈ నెల 27న శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఒకే వేదికపై సందడి చేయనున్న బాలయ్య, అల్లు అర్జున్
Allu Arjun will attend Balakrishna Akhanda movie pre release event
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడు. ఒకే వేదికపై బాలయ్య, బన్నీ కనువిందు చేయనుండడం పట్ల అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఏమైనా ఇది అరుదైన కలయికే అని చెప్పాలి.

'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27 సాయంత్రం హైదరాబాదు శిల్పకళా వేదికలో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. 'అఖండ' చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా కనిపించనున్నారు. ఇందులో జగపతిబాబు, శ్రీకాంత్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.