ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద పడి ఏడుస్తున్నారు: అంబటి

25-11-2021 Thu 17:58
  • జూనియర్ ఎన్టీఆర్ పై వర్ల రామయ్య, బుద్ధా వ్యాఖ్యలు
  • భువనేశ్వరి అంశంలో సరిగా స్పందించలేదని విమర్శలు
  • ఇప్పటిదాకా తమపై పడి ఏడ్చారన్న అంబటి
  • మీ బతుకుంతా ఏడుపే అంటూ చంద్రబాబునుద్దేశించి ట్వీట్
Ambati Rambabu satires on Chandrabau and TDP leaders
నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానించడంపై జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు.

అనని దాన్ని ఏదో అన్నామని తమ మీద పడి ఏడుస్తున్నారని, ఇప్పుడు స్పందన సరిగాలేదని జూనియర్ ఎన్టీఆర్ మీద పడి ఏడుస్తున్నారని  విమర్శించారు. ఇక మీ భవిష్యత్తు అంతా ఏడుపే  అంటూ చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు.

అంతకుముందు... భువనేశ్వరికి జరిగిన అవమానం పట్ల ఆమె మేనల్లుడిగా ఎన్టీఆర్ స్పందన అంతంతమాత్రంగా ఉందని వర్ల రామయ్య వ్యాఖ్యానించగా... మరో 'ఆది'లా, మరో 'సింహాద్రి'లా వస్తాడనుకుంటే చాగంటి వారిలా ప్రవచనాలు చెప్పాడంటూ బుద్ధా వెంకన్న విమర్శించారు.