చరణ్ సినిమా కోసం విదేశాల నుంచి డాన్సర్స్!

25-11-2021 Thu 17:49
  • హైదరాబాద్ లో శంకర్ సినిమా షూటింగ్
  • 80 మంది విదేశీ డాన్సర్లతో పాట చిత్రీకరణ
  • కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్
  • వచ్చే ఏడాది చివరిలో విడుదల
shankar and Charan movie update
చరణ్ హీరోగా శంకర్ ఒక విభిన్నమైన కథాంశాన్ని రూపొందిస్తున్నాడు. చరణ్ జోడీగా కియారా అద్వాని నటిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగు జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో చరణ్ .. కియారాలపై ఒక పాటను చిత్రీకరించనున్నారు.

ఈ పాటకు శంకర్ డిఫరెంట్ గా డాన్స్ ను డిజైన్ చేయించాడట. వివిధ దేశాలకి చెందిన 80 మంది డాన్సర్లు ఈ పాటలో పాల్గొననున్నారు. ఆల్రెడీ అమెరికా .. రష్యా .. బ్రెజిల్ .. ఉక్రెయిన్ .. యూరప్ నుంచి డాన్సర్స్ వచ్చేశారు. ఈ బృందంపై 10 రోజుల పాటు చిత్రీకరణ జరుగుతుందని అంటున్నారు.

తమన్ స్వరపరిచిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.