పెన్సిల్ పోయిందంటూ కర్నూలు జిల్లా కడుబూరు పోలీసులకు చిన్నారి ఫిర్యాదు... వీడియో ఇదిగో!

25-11-2021 Thu 16:22
  • పోలీస్ స్టేషన్ లో పెన్సిల్ పంచాయితీ
  • మరో పిల్లవాడిపై ఓ చిన్నారి ఫిర్యాదు
  • రాజీ కుదిర్చిన పోలీసులు
  • వీడియోను పంచుకున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
Kid complains police about pencil theft
కర్నూలు జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. తన పెన్సిల్ పోయిందంటూ ఓ చిన్నారి పెద కడుబూరు పోలీసులను ఆశ్రయించాడు. మరో పిల్లవాడు తన పుస్తకాలు, పెన్సిల్ ఎత్తుకెళ్లాడని, రోజూ ఇలాగే చేస్తుంటాడని ఆ చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాంతో పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లవాడ్ని కూడా స్టేషన్ కు పిలిపించారు. మరెప్పుడూ ఇలా చేయకూడదంటూ ఆ అబ్బాయికి హితవు పలికారు. అంతేకాదు, ఆ ఇద్దరు చిన్నారుల మధ్య రాజీ కుదిర్చి, చేయి చేయి కలిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.