వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డికి డిసెంబరు 2 వరకు సీబీఐ కస్టడీ

25-11-2021 Thu 16:07
  • వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
  • ఇటీవల కీలక నిందితుడు శివశంకర్ రెడ్డి అరెస్ట్
  • కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ పిటిషన్
  • నేడు విచారణ జరిపిన పులివెందుల కోర్టు
  • 7 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు
Court imposes CBI custody for Sivashankar Reddy in Viveka murder case
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలే కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ... అతడిని 8 రోజులు కస్టడీకి అప్పగించాలంటూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఆ పిటిషన్ పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం శివశంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి అనుమతించింది. అయితే 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 2 వరకు సీబీఐ కస్టడీ కొనసాగనుంది. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.