నన్ను, నా కుటుంబాన్ని ఎన్ని అవమానాలకు గురిచేసినా ప్రజల కోసం ఎల్లప్పుడూ ముందుంటా: చంద్రబాబు

25-11-2021 Thu 14:43
  • నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
  • ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని విమర్శలు
  • మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని వ్యాఖ్యలు
Chandrababu visits Nellore district flood hit areas
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను, తన కుటుంబాన్ని ఎన్ని అవమానాలకు గురిచేసినా ప్రజల కోసం ఎల్లప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఏపీ అసెంబ్లీలో అడుగుపెడతానని పునరుద్ఘాటించారు.

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధమన్న జగన్ రెడ్డి మద్యం తాగితేనే పథకాలు అందిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.