నా జీవితంలో అత్యంత విచారకరమైన దశ అదే: హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్

25-11-2021 Thu 14:51
  • ఫస్ట్ లవ్ స్టోరీని పంచుకున్న హీరో
  • 16 ఏళ్లకే ప్రేమలో పడ్డానని వెల్లడి
  • ఆమె వేరేవ్యక్తితో అఫైర్ పెట్టుకోవడం బాధించిందని కామెంట్
  • ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు శృంగారం చేసేవాడినన్న స్మిత్
Hollywood Hero Will Smith Sensational Comments On His First Love
తన జీవితంలో ప్రేమ, శృంగారం, బ్రేకప్ వంటి విషయాలపై హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల అభిమానులతో మాట్లాడిన అతడు సంచలన విషయాలను పంచుకున్నాడు. 16 ఏళ్ల వయసులో మెలానియా అనే యువతితో ప్రేమలో పడ్డానని చెప్పాడు. ఓ కన్సర్ట్ లో భాగంగా ఇద్దరం కొన్నాళ్లు దూరంగా ఉన్నామని, ఆ సమయంలో ఆమె వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుందని చెప్పాడు. అది తనను చాలా బాధించిందని, వెంటనే బ్రేకప్ చెప్పి విడిపోయామని వెల్లడించాడు.

ఆ బాధను దిగమింగుకోలేక, ఒత్తిడిని తట్టుకోలేక విపరీతంగా శృంగారంలో పాల్గొనేవాడినని గుర్తు చేసుకున్నాడు. చాలా మంది మహిళలతో సన్నిహితంగా మెలిగానని, అది కాస్తా మరింత తీవ్రమైందని చెప్పాడు. అయితే తనకు ఇష్టం లేకుండా శృంగారం చేసేవాడినని, కొన్ని సార్లు వాంతులు కూడా అయ్యేవని గుర్తు చేసుకున్నాడు. కాగా, ప్రస్తుతం విల్ స్మిత్ సెరీనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ తండ్రి, టెన్నిస్ కోచ్ రిచర్డ్ విలియమ్స్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘కింగ్ రిచర్డ్’ అనే బయోపిక్ లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు.

1992లో అతడు షిరీ జాంపియానోను పెళ్లాడాడు. వారికి ఓ కుమారుడు పుట్టాడు. 1995లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 1997లో జాడా పింకెట్ స్మిత్ అనే నటిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. వారి పేర్లు జాడెన్ క్రిస్టఫర్ సైర్ స్మిత్, విల్లో కెమిలీ రౌన్ స్మిత్.