టీమిండియా టాపార్డర్ ను దెబ్బతీసిన కైల్ జేమీసన్

25-11-2021 Thu 14:23
  • కాన్పూర్ లో టీమిండియా, న్యూజిలాండ్ తొలి టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 145 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • 3 వికెట్లు పడగొట్టిన జేమీసన్
Kyle Jamieson rattled Team India top order on Kanpur test
కాన్పూర్ లో న్యూజిలాండ్ తో నేడు ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కివీస్ పేసర్ కైల్ జేమీసన్ 3 వికెట్లతో భారత టాపార్డర్ ను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక సారథి అజింక్యా రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 13 పరుగులకే జేమీసన్ బౌలింగ్ లో అవుటై నిరాశ పరిచాడు.

మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (52) నిలకడగా ఆడి అర్ధసెంచరీ నమోదు చేయడంతో భారత్ కుదురుకుంది. మరో ఎండ్ లో గిల్ కు ఛటేశ్వర్ పుజారా (26) నుంచి సహకారం లభించింది. అయితే గిల్ ను జేమీసన్ బౌల్డ్ చేయడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అటు పుజారాను సౌథీ అవుట్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ రహానే ఓ మోస్తరుగా ఆడి 35 పరుగులు చేశాడు. అయితే రహానే వికెట్ కూడా జేమీసన్ ఖాతాలోకే చేరింది. ఈ పొడగరి పేసర్ ఓ అద్భుతమైన బంతితో రహానేను బౌల్డ్ చేశాడు.

ప్రస్తుతం టీమిండియా స్కోరు 56 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు కాగా.... శ్రేయాస్ అయ్యర్ 17, రవీంద్ర జడేజా 6 పరుగులతో ఆడుతున్నారు.