Tollywood: ప్రముఖ గాయని​ హరిణి కుటుంబం అదృశ్యం.. రైల్వే ట్రాక్​ పై శవమై తేలిన హరిణి తండ్రి

  • వారం రోజులుగా హైదరాబాద్ లోని ఇంటికి తాళం
  • బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో ఎ.కె. రావు మృతి
  • ఒంటిపై కత్తి గాయాలు.. హత్య కేసు నమోదు
  • హరిణి ఫ్యామిలీ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు కథనాలు
Popular Play Back Singer Harini Family Goes Missing Since a Week Her Father Dead Body Found At Railway Track

ప్రముఖ గాయని హరిణి కుటుంబం వారం రోజులుగా కనిపించకుండా పోయింది. వారు ఎక్కడున్నారన్నది తెలియరాకుండా ఉంది. వారి ఫోన్లు కూడా స్విచాఫ్ అయ్యాయి. వారం రోజులుగా హైదరాబాద్ లోని వారి ఇంటికి తాళం పెట్టి ఉంది. బంధువులు ఎంత ట్రై చేసినా వారి ఆచూకీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని రైల్వే ట్రాక్ పై హరిణి తండ్రి ఎ.కె. రావు మృతదేహాన్ని కొన్ని రోజుల క్రితం పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో ఆయన చనిపోయి కనిపించారు.

ఎ.కె. రావు మృతిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శరీరంపై కత్తిగాట్లుండడంతో హత్య కేసుగా నమోదు చేశారు. ఈ నెల 8న ఆయన హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నెల 19న కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 23న ఆయన చనిపోయినట్టు బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. ఆ తర్వాత బెంగళూరులోనే అంత్యక్రియలు చేశారు.


అయితే, హరిణి కుటుంబ సభ్యులు బెంగళూరు రైల్వే పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైనట్టు తెలుస్తోంది. ఆర్థిక సంబంధ విషయాలే ఆయన హత్యకు పురిగొల్పి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్ సీఈవోగా ఎ.కె. రావు కొన్నాళ్లు పనిచేశారు. కాగా, ఇటు ప్లేబ్లాక్ సింగర్ గానూ, అటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ హరిణి పనిచేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో 3,500కుపైగా పాటలు పాడారు. మురారి, గుడుంబా శంకర్, ఘర్షణ, అల్లుడు శీను వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలు హిట్ అయ్యాయి.

More Telugu News