Telangana: తెలంగాణ స్పీకర్ పోచారంకు కరోనా.. ఆసుపత్రిలో చేరిక

Telangana Speaker Pocharam Tested For Covid 19 Positive
  • గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
  • కలిసిన వారు ఐసోలేట్ అవ్వాలని పోచారం విజ్ఞప్తి
  • మనుమరాలి పెళ్లిలో ఆయన పక్కనే తెలుగు రాష్ట్రాల సీఎంలు
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెగ్యులర్ మెడకిల్ చెకప్ లో భాగంగా టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలిందని, తనను కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. తనకు బాగానే ఉందని, వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానని చెప్పారు.

కాగా, కొన్ని రోజుల క్రితం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనుమరాలి వివాహానికి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. పలువురు మంత్రులూ, ఎమ్మెల్యేలు పెళ్లికి వచ్చారు. ఈ పెళ్లి వేడుకలోనే జగన్, కేసీఆర్ లు ప్రత్యేకంగా లంచ్ చేశారు. వారితో పాటు స్పీకర్ కూడా ఉన్నారు. పెళ్లి వేడుకలో పోచారం పక్కనే తెలుగు రాష్ట్రాల సీఎంలు కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకుని ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలని పోచారం కోరారు.
Telangana
Andhra Pradesh
Pocharam Srinivas
TRS
KCR
YS Jagan

More Telugu News