శివ శంకర్ మాస్టర్ ప్రాణాలు కాపాడడానికి చేతనైన సాయం చేస్తా: సోనూసూద్

25-11-2021 Thu 12:09
  • ఐదు రోజులుగా శివ శంక‌ర్ మాస్ట‌ర్‌కు 'క‌రోనా' చికిత్స‌
  • శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబంతో సోనూసూద్ సంప్ర‌దింపులు
  • శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుమారుడితో మాట్లాడిన సోనూసూద్
sonu speaks with shiv shankar master son
క‌రోనా సోక‌డంతో గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ చికిత్స తీసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఇప్ప‌టికే వైద్యులు తెలిపారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప‌రామ‌ర్శిస్తున్నారు.

శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై సినీ న‌టుడు సోనూసూద్ ఆరా తీశారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుమారుడు అజ‌య్‌తో ఆయ‌న‌ మాట్లాడారు. ఆరోగ్య ప‌రిస్థితి గురించి తెలుసుకుని ప‌రామ‌ర్శించారు. మ‌రోవైపు,  తాను శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాన‌ని, ఆయ‌న‌ ప్రాణాలు కాపాడడానికి చేతనైన సాయం చేస్తానని సోనూసూద్ ట్వీట్ చేశారు.  

శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబ స‌భ్యుల్లో ముగ్గురు ఒకేసారి కరోనా బారిన పడడం గ‌మ‌నార్హం. వారి ముగ్గురికీ ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో శివ శంక‌ర్ మాస్ట‌ర్ చిన్నకొడుకు అజయ్ కృష్ణ త‌న కుటుంబ స‌భ్యుల బాగోగుల‌ను చూసుకుంటున్నారు.