కమలహాసన్ కు ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్

25-11-2021 Thu 11:35
  • కరోనా బారిన పడిన కమలహాసన్
  • సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్న వైనం
  • తన మిత్రుడికి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్న రజనీ
Rajinikanth calls Kaml Haasan
విలక్షణ నటుడు కమలహాసన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యపరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు.  

మరోవైపు తన తండ్రి కోలుకుంటున్నారని ఆయన కుమార్తె, సినీనటి శృతిహాసన్ వెల్లడించారు. కమల్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కమలహాసన్ ఆరోగ్యం బాగుందంటూ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ అధికారులు కూడా బులెటిన్ విడుదల చేశారు.

మరోవైపు కమలహాసన్, రజనీకాంత్ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. తన మిత్రుడికి కరోనా పాజిటివ్ అని తెలుసుకున్న రజనీకాంత్... ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు.