దీక్ష‌కు దిగిన వ‌ర్ల రామ‌య్య దంప‌తులు

25-11-2021 Thu 11:13
  • నేటి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింపు
  • వైసీపీ నేతలు రోజు రోజుకీ రెచ్చిపోతున్నార‌ని విమ‌ర్శ‌లు
  • చంద్ర‌బాబు  కుటుంబానికి సీఎం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్
varlaramaiah sits in agitation
టీడీపీ నేత వర్ల రామయ్య త‌న భార్య‌తో క‌లిసి దీక్ష చేస్తున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబాన్ని ఇటీవ‌ల‌ అసెంబ్లీలో కించపర్చినందుకుగాను ఈ దీక్ష చేస్తున్న‌ట్లు వ‌ర్ల రామ‌య్య తెలిపారు. ఈ రోజు ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఆయ‌న ఇంట్లో ప్రారంభ‌మైన ఈ దీక్ష ఈ రోజు రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.  

వైసీపీ నేతలు రోజు రోజుకీ రెచ్చిపోతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.  చంద్ర‌బాబు నాయుడి కుటుంబానికి సీఎం జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. వ‌ర్ల రామ‌య్య దంప‌తుల దీక్ష‌కు ప‌లువురు టీడీపీ నేత‌లు మద్ద‌తు తెలిపారు.