ఏపీ సినిమాటోగ్రఫీ చట్టసవరణ.. డిస్ట్రిబ్యూటర్ల నుంచి మిశ్రమ స్పందన

25-11-2021 Thu 10:09
  • ఇకపై ఆన్ లైన్లోనే టికెట్ల విక్రయాలు
  • రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతి
  • బెనిఫిట్ షోలను రద్దు చేసిన ప్రభుత్వం
Distributers response on online tickets sales
కీలకమైన సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై సినిమా టికెట్ల విక్రయాలు ఆన్ లైన్లోనే జరగనున్నాయి. మరోవైపు బెనిఫిట్ షోలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ప్రభుత్వ నిర్ణయంపై సినీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నిర్ణయాల వలన ఉపయోగం లేదని... డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే అవకాశం ఉందని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు సినీ నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ, ఆన్ లైన్ లో టికెట్స్ అమ్మాలని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఎప్పటి నుంచో కోరుతున్నారని చెప్పారు. ఎగ్జిబిటర్ల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.