Team New Zealand: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. టాస్ గెలిచిన ఇండియా

India vs New Zealand First Test Rahane won the Toss
  • కాన్పూరులోని గ్రీన్ పార్క్ వేదికగా తొలి టెస్టు
  • బ్యాటింగ్ ఎంచుకున్న రహానే
  • మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్న అభిమానులు
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య మరికాసేపట్లో తొలి టెస్టు ప్రారంభం కాబోతోంది. కాన్పూరులోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టెస్టు సిరీస్‌ను కూడా దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, టెస్టు సిరీస్‌లో గెలిచి టీ20 సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ భావిస్తోంది. తొలి టెస్టును వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. దీంతో స్టేడియం వద్ద కోలాహలం నెలకొంది.

భారతజట్టు: శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్

కివీస్ జట్టు: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జెమీసన్, విలియమ్ సోమర్‌విల్లే
Team New Zealand
Team India
Kanpur
Green Park
Test Match

More Telugu News