సరికొత్త గెటప్ లో వస్తున్న హీరో రాజ'శేఖర్'

24-11-2021 Wed 21:42
  • శేఖర్ చిత్రంలో నటిస్తున్న రాజశేఖర్
  • జీవిత దర్శకత్వంలో చిత్రం
  • నిర్మాతలుగా రాజశేఖర్ కుమార్తెలు
  • రేపు సాయంత్రం ఫస్ట్ గ్లింప్స్ విడుదల
Hero Rajasekhar first glimpse from Sekhar will release tomorrow
యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా 'శేఖర్' అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రేపు సాయంత్రం 5.04 గంటలకు రాజశేఖర్ ఫస్ట్  గ్లింప్స్ విడుదల కానుంది. 'శేఖర్' వస్తున్నాడు అని చిత్ర బృందం పేర్కొంది.

మునుపెన్నడూ చూడని రీతిలో సరికొత్త రాజశేఖర్ కనిపిస్తాడని వెల్లడించింది. ఈ సినిమాను రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మికలతో పాటు బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.