'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

24-11-2021 Wed 19:08
  • బోయపాటి నుంచి మరో యాక్షన్ మూవీ
  • డిఫరెంట్ లుక్స్ తో బాలకృష్ణ
  • ఈ నెల 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • డిసెంబర్ 2వ తేదీన సినిమా రిలీజ్
Akhanda Pre Release Event Date Confirmed
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో 'అఖండ' సినిమా రూపొందింది. రైతుగా .. అఘోరగా బాలకృష్ణ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నా రు. ఆయన సరసన నాయికగా ప్రగ్యా కనువిందు చేయనుంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో జరపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక టాక్ వినిపించింది. అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన, హైదరాబాదులోనే జరపనున్నట్టు ఒక వార్త వచ్చింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు.

ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ - మాదాపూర్ లోని శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఆ రోజున సాయంత్రం 6:30 గంటలకు ఈ వేడుక మొదలవుతుంది. ఈ సినిమాతో బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి..