KTR: బీజేపీ గూండాలు జీహెచ్ఎంసీ ఆఫీసును ధ్వంసం చేశారు: కేటీఆర్

KTR reacts after BJP cadre attacked on GHMC office
  • నిన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ ఆందోళన
  • కార్యాలయంపై దాడి జరిగిందన్న కేటీఆర్
  • గాడ్సే భక్తులు అంటూ వ్యాఖ్యలు
  • చర్యలు తీసుకోవాలంటూ సీపీని కోరిన కేటీఆర్

హైదరాబాదులోని జీహెచ్ఎంసీ ఆఫీసులోపలికి ప్రవేశించిన బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఆందోళన చేపట్టడం పట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. నిన్న కొందరు బీజేపీ గూండాలు హైదరాబాదులోని జీహెచ్ఎంసీ ఆఫీసును ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ దౌర్జన్యపూరిత వైఖరిని గట్టిగా ఖండిస్తున్నానని తెలిపారు. గాడ్సే భక్తులను గాంధేయ మార్గంలో నడవమని చెప్పడం ఎంత కష్టమో దీన్నిబట్టే అర్థమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన అరాచక శక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలు చొచ్చుకువచ్చినప్పటి ఫొటోలను కూడా పంచుకున్నారు.

  • Loading...

More Telugu News