'ఆచార్య' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

24-11-2021 Wed 17:24
  • కొరటాల రూపొందించిన 'ఆచార్య'
  • ప్రధానమైన పాత్రల్లో చిరూ - చరణ్
  • అవినీతిపై పోరాటమే నేపథ్యంగా కథ
  • ఫిబ్రవరి 4వ తేదీన విడుదల  
Acharya teaser will release on 28th November
కొరటాల శివ తాజా చిత్రంగా 'ఆచార్య' సినిమా రూపొందింది. నిరంజన్ రెడ్డి - చరణ్ నిర్మించిన ఈ సినిమాలో, చిరంజీవి - చరణ్ పవర్ఫుల్ పాత్రలను పోషించారు. అవినీతిపై పోరాటానికి నడుం బిగించిన నక్సలైట్లుగా వాళ్లు ఈ సినిమాలో కనిపించనున్నారు. వాళ్ల సరసన నాయికలుగా కాజల్ .. పూజ హెగ్డే అలరించనున్నారు.

మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన చిరంజీవి 'లాహే లాహే' సాంగ్, చరణ్ 'నీలాంబరి' సాంగ్ రికార్డుస్థాయి వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఈ నెల 28వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలియజేస్తూ, అధికారికంగా ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సిద్ధ పాత్రలో చరణ్ ను హైలైట్ చేస్తూ ఈ పోస్టర్ ను వదిలారు. చరణ్ నాటు తుపాకీని పట్టుకుని ఆవేశంతో ముందుకు ఉరుకుతున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..