ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

24-11-2021 Wed 16:49
  • కృష్ణా జిల్లాలో ఒకే ఒక్క మరణం నమోదు
  • కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన 247 మంది
  • యాక్టివ్‌గా 2,175 కేసులు
Slight increase in Corona Cases In Andhrapradesh
నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్న 196 మంది కరోనా బారినపడగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 264 మంది కరోనా బాధితులుగా మారారు. అలాగే, కొవిడ్ బారినపడి కృష్ణా జిల్లాలో ఒకే ఒక్క మరణం నమోదైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 247 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,987 మందిని పరీక్షించారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కొవిడ్ పరీక్షల సంఖ్య 3,02,55,667కి పెరిగింది.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,71,831కి పెరగ్గా, 14,430 మంది మరణించారు. రాష్ట్రంలో ఇంకా 2,175 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, కర్నూలులో అత్యల్పంగా మూడు కేసులు మాత్రమే వెలుగు చూడగా, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 46 కేసులు నమోదయ్యాయి.