మీరు నాపై చూపించిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు: సాయిధరమ్ తేజ్

24-11-2021 Wed 15:46
  • రిపబ్లిక్ సినిమాను మీతో కలిసి చూడలేకోయాను
  • 26న జీ5లో విడుదల అవుతోంది
  • చూసి రెస్పాన్స్ ఇవ్వండి
Mega Hero Sai Dharam Tej realeased audio message to fans
రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో  పక్కటెముకలు విరగడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ తన కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు.

సాయి ధరమ్‌తేజ్ నటించిన సినిమా ‘రిపబ్లిక్’ ఇటీవల  థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నెల 26న సినిమాను జీ5లో విడుదల చేయనుండడంతో తాజాగా ఓ ఆడియో మెసేజ్‌ను తేజ్ విడుదల చేశారు. ఈ మెసేజ్‌కు ముందు రిపబ్లిక్ సినిమాలోని ఓ సీన్‌ను జోడించారు. అనంతరం సాయితేజ్ ఆడియో మెసేజ్ ఉంది.

ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనపై చూపించిన ప్రేమ, కురిపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సాయితేజ్ పేర్కొన్నారు. రిపబ్లిక్ సినిమాను థియేటర్‌లో మీతో కలిసి చూడలేకపోయానని, కానీ ఆ సినిమా ఈ నెల 26న జీ5లో విడుదల అవుతోందని పేర్కొన్నారు. సినిమాను చూసి స్పందించాలని కోరిన సాయితేజ్ చివర్లో జైహింద్ అని ముగించారు.