మరో నిర్మాతకు మాట ఇచ్చిన మెగాస్టార్?

24-11-2021 Wed 11:54
  • వరుస సినిమాలతో బిజీగా చిరంజీవి
  • విష్ణువర్ధన్ ఇందూరి నుంచి కొత్త ప్రాజెక్టు
  • 'విజేత' సీక్వెల్ అంటూ టాక్
  • లైన్లో మారుతి .. వెంకీ కుడుముల  
Chiranjeevi Movies Update
చిరంజీవి ఈ మధ్య వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నారు. ఇవన్నీ కూడా ఆయన స్థాయికి తగిన భారీ సినిమాలే. ఈ నేపథ్యంలోనే ఆయన మరో నిర్మాతకి మాట ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరితో చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉంది.

అందువలన ఇటీవల ఇద్దరూ కలిసినప్పుడు తమ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తే బాగుంటుందని విష్ణు అనగా, అందుకు చిరంజీవి సుముఖతను వ్యక్తం చేశారట. తనకి చిరంజీవి సినిమాల్లో 'విజేత' అంటే ఎంతో ఇష్టమనీ, ఆ సినిమాకి సీక్వెల్ ను గానీ .. ఆ తరహాలో గాని మరో సినిమా చేయాలనుందని విష్ణు చెప్పారట.

దాంతో ఇప్పుడు అందరూ ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ ఎవరనే విషయంతో పాటు ఇతర వివరాలను ప్రకటిస్తారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్' .. 'భోళా శంకర్' .. 'వాల్తేర్ వాసు' సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత దర్శకులుగా మారుతి .. వెంకీ కుడుముల పేర్లు వినిపిస్తున్నాయి.