ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రెడీ అవుతున్న 'పుష్ప'

24-11-2021 Wed 10:20
  • అడవి నేపథ్యంలో సాగే 'పుష్ప'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • అంచనాలు పెంచుతున్న పాటలు
  • డిసెంబర్ 2వ తేదీన సినిమా రిలీజ్  
Pushpa trailer release on December 2nd
సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ - రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాను, డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన ప్రతి పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా దేవిశ్రీ బీట్స్ అదుర్స్ అనేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ ట్రైలర్ ను సింపుల్ గా వదిలేయకుండా, ఒక వేదిక ద్వారా వదలడమే మంచిదనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారట. డిసెంబర్ 2వ తేదీన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

దాదాపుగా ఈ తేదీ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఇక ఆ రోజున ఇక్కడ ఈవెంట్ ను జరిపేసి, ఆ తరువాత నుంచి మిగతా భాషల్లోను ప్రమోషన్స్ జోరు పెంచుతారట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అధిగమించడం ఖాయమనే బలమైన నమ్మకంతో టీమ్ ఉంది.