BCCI: టీమిండియా క్రికెటర్ల ఆహారంపై వివాదం... వివరణ ఇచ్చిన బీసీసీఐ

  • రేపటి నుంచి భారత్, కివీస్ టెస్టు సిరీస్
  • కాన్పూర్ లో తొలి టెస్టు
  • ఆటగాళ్ల మెనూలో పందిమాంసం, బీఫ్ నిషేధం
  • నెటిజన్ల ఫైర్
BCCI gives explanation on menu row

రేపటి నుంచి టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే క్రికెటర్లకు అందించే ఆహార పదార్థాలపై వివాదం ఏర్పడింది. భారత ఆటగాళ్లకు అందించే ఆహారంలో పంది మాంసం, బీఫ్ పై నిషేధం విధించినట్టు వార్తలు వచ్చాయి. హలాల్ చేసిన మాంసాన్ని అందించనున్నారని ఆయా కథనాల సారాంశం. ఇటు న్యూజిలాండ్ జట్టుకు ఇదే మెనూ వర్తిస్తుందని, ఆ జట్టులోనూ అజాజ్ పటేల్ వంటి ముస్లిం ఆటగాడు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది.

దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ వివరణ ఇచ్చారు. ఆటగాళ్ల ఆహారానికి సంబంధించిన విషయంలో బోర్డు ఎలాంటి నిషేధాజ్ఞలు విధించలేదని స్పష్టం చేశారు. క్రికెటర్లు ఎవరికి నచ్చిన ఆహార పదార్థాలను వారు ఎంచుకోవచ్చని వివరించారు. ఆటగాళ్ల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేసే దిశగా బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ధుమాల్ వెల్లడించారు.

More Telugu News