నేను ఎక్కడ పుడితే నీకెందుకురా... 'అలీతో సరదాగా' కార్యక్రమంలో బ్రహ్మానందం చమక్కులు

24-11-2021 Wed 09:21
  • అలీ హోస్ట్ గా అలీతో సరదాగా కార్యక్రమం
  • తాజా ఎపిసోడ్ లో బ్రహ్మానందంతో ఇంటర్వ్యూ
  • ఆసక్తికర అంశాలు వెల్లడించిన హాస్య నట బ్రహ్మ
  • ప్రోమో విడుదల
Brahmanandam hilarious show in Ali Tho Saradaga latest episode
ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ గా నిర్వహించే 'అలీతో సరదాగా' కార్యక్రమం ఎంతో ప్రజాదరణ పొందింది. ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ షోని అలీ నడిపించే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. తాజా ఈ కార్యక్రమానికి హాస్య నట బ్రహ్మ బ్రహ్మానందం విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇద్దరూ దిగ్గజ కమెడియన్లు కావడంతో ఈ షోలో నవ్వుల జడివాన కురిసింది.

మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అంటూ అలీ ఇంటర్వ్యూ ప్రారంభించగా... ఆరంభంలోనే బ్రహ్మీ కౌంటర్ వేశారు. ఎందుకురా ఇవన్నీ అంటూ చమత్కారంగా బదులిచ్చారు. తనలో హాస్య నటుడు ఉన్నాడని గుర్తించి ప్రోత్సహించిన వ్యక్తి కీర్తిశేషులు జంధ్యాల గారు అని వినమ్రంగా తెలిపారు. "ఆ తర్వాత నా బతుకు మీకు తెలిసిందే" అంటూ మళ్లీ ఓ చమక్కు విసిరారు. అంతేకాదు, ఎవరైనా తనకు సన్మానం చేస్తే ఇంటికొచ్చి నేలపై పడుకుంటానని, ఇంట్లోవాళ్లకు కూడా క్రమంగా అలవాటై పోయిందని వివరించారు.