నటుడు కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ సీఎం జగన్

23-11-2021 Tue 22:04
  • నటుడు కైకాల సత్యనారాయణకు తీవ్ర అనారోగ్యం
  • హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • కైకాల ఆరోగ్యంపై ఆరా తీసిన సీఎం జగన్
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
AP CM Jagan talks to Kaikala Satyanarayana family members
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యం కారణంగా హైదరాబాదులో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంకా ఐసీయూలోనే వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ నటుడు కైకాల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కైకాల ఆరోగ్య పరిస్థితిని, చికిత్స తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. కైకాల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, కైకాల ఆరోగ్యంపై వదంతులు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఖండించడం తెలిసిందే.