వరద బాధితుల కోసం జోలె పట్టి విరాళాలు సేకరించాలని ఏపీ బీజేపీ నిర్ణయం

23-11-2021 Tue 21:18
  • దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వరద బీభత్సం
  • బాధితులను ఆదుకునేందుకు బీజేపీ కార్యాచరణ
  • ఈ నెల 25, 26 తేదీల్లో విరాళాల సేకరణ
  • వస్తు, నగదు రూపేణా విరాళాల సేకరణ
AP BJP to collect donations for flood hit people
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల కోసం జోలె పట్టి విరాళాలు సేకరించాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పిలుపునిచ్చారు.

తుపాను ప్రభావిత జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో బాధితులకు సాయం చేయడానికి వీలుగా ఈ నెల 25, 26 తేదీల్లో విరాళాలు సేకరించేందుకు కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. ఈ విరాళాల సేకరణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందని... వస్తు, నగదు రూపంలో విరాళాలు సేకరించాలని ఏపీ బీజేపీ తమ శ్రేణులకు సూచించింది. ఈ నేపథ్యంలో, ఈ నెల 26న జరగాల్సిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ వాయిదా పడింది.