వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.1 లక్ష ఆర్థికసాయం ప్రకటించిన చంద్రబాబు

23-11-2021 Tue 19:07
  • కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • వరద బాధితులకు పరామర్శ
  • సీఎం జగన్ పై విమర్శలు
  • ఆకాశంలో విహరిస్తే కష్టాలు ఎలా తెలుస్తాయంటూ ఆగ్రహం
Chandrababu visits flood victims family members
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లాలో వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. అయిన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చారు. ఈ సందర్భంగా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చంద్రబాబు రూ.1 లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. అంతేకాకుండా, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 చొప్పున సాయం అందజేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో ఆయన ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. వరదల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ఆకాశంలో విహరిస్తే వరద బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు.