Mahesh Babu: నీ కంటే మీ గురువు గారే నయం: ఎన్టీఆర్ తో మహేశ్ బాబు వ్యాఖ్యలు

Mahesh Babu appears on NTR Evaru Meelo Koteeswarulu
  • ఎన్టీఆర్ హోస్ట్ గా 'ఎవరు మీలో కోటీశ్వరులు'
  • సెలబ్రిటీలతో అప్పుడప్పుడు స్పెషల్ ఎపిసోడ్లు
  • త్వరలోనే మహేశ్ బాబు తో 'ఎవరు మీలో కోటీశ్వరులు'
  • ప్రోమో విడుదల చేసిన జెమిని టీవీ
జెమిని టీవీలో ప్రసారం అయ్యే 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షో దూసుకుపోతోంది. హోస్ట్ గా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో రాణిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నాడు. అప్పుడప్పుడు రామ్ చరణ్, సమంత వంటి సెలబ్రిటీలు కూడా వస్తుండడంతో 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో జనరంజకంగా సాగుతోంది. తాజాగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను జెమిని టీవీ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.

"సెటప్ అదిరిపోయింది!" అంటూ మహేశ్ బాబు కామెంట్ చేయగా, "నా రాజా" అంటూ ఎన్టీఆర్ ఉత్సాహంగా బదులివ్వడం ప్రోమోలో చూడొచ్చు. కాగా, తాను చెప్పిన సమాధానాన్ని ఎన్టీఆర్ అటు తిప్పి ఇటు తిప్పి తికమక పెట్టేందుకు ప్రయత్నించడంతో, "నీ కంటే మీ గురువు (కంప్యూటర్) గారే నయం" అంటూ మహేశ్ బాబు చమత్కరించాడు. మొత్తమ్మీద 'ఎవరు మీలో కోటీశ్వరులు'లో ఈ స్పెషల్ ఎపిసోడ్ రసవత్తరంగా ఉంటుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుందని జెమిని టీవీ పేర్కొంది.
Mahesh Babu
NTR
Evaru Meelo Koteeswarulu
Gemini TV
Tollywood

More Telugu News