దయచేసి అనవసర వార్తలొద్దు.. కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై స్పందించిన ఆయన కూతురు

23-11-2021 Tue 11:18
  • జనాన్ని ఆందోళనకు గురిచేయొద్దన్న రమాదేవి
  • తన తండ్రి అందరితో మాట్లాడుతున్నారని వెల్లడి
  • ఆడియో వాయిస్ ద్వారా సందేశం
Kaikala Daughter Responded Over Satyanarayan Health
అలనాటి నటుడు కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారు. అందరితోనూ మాట్లాడుతున్నారు. తనతో మాట్లాడారని చిరంజీవి తెలిపిన సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రి వైద్యులూ ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తున్నాయి. తాజాగా ఆయన కూతురు రమాదేవి కూడా ఆయన ఆరోగ్యంపై స్పందించారు. ఆడియో వాయిస్ ద్వారా ఆమె సందేశాన్నిచ్చారు.
 
కైకాల సత్యనారాయణ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగైందని చెప్పారు. అందరితోనూ మాట్లాడుతున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దయచేసి అనవసర వార్తలతో జనాలను ఆందోళనకు గురి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా, గత మూడు రోజులుగా కైకాల సత్యనారాయణకు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సంగతి తెలిసిందే. వైద్యానికి ఆయన స్పందించడంలేదని తొలుత ప్రకటించడంతో ఆందోళన నెలకొంది.