'బంగార్రాజు' నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్!

23-11-2021 Tue 11:09
  • నాగార్జున హీరోగా 'బంగార్రాజు'
  • కథలో ఆయన వారసుడిగా చైతూ
  • ఆయన జోడీగా కృతి శెట్టి
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్
Bangarraju Teaser released
నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలోని 'బంగార్రాజు' పాత్రను టైటిల్ గా చేసుకుని, అదే దర్శకుడితో నాగార్జున ఈ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో నాగ్ డ్యూయెల్ రోల్ చేయగా, ఈ సినిమాలో చైతూ మరో ప్రధానమైన పాత్రలో చేస్తున్నాడు.

నాగచైతన్య జోడీగా కృతి శెట్టి కనువిందు చేయనుంది. ఆమె లుక్ ను కూడా రీసెంట్ గా వదిలారు. 'నాగలక్ష్మి'గా ఆమె లుక్ కి మంచి మార్కులు పడ్డాయి. నిన్న చైతూ ఫస్టులుక్ ను వదిలిన టీమ్, ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

నాగార్జున నిలువెత్తు చిత్రపటం దగ్గర గతంలో ఆయన వాడిన పులిగోరు .. వాచ్ .. స్పెట్స్ .. రింగులు .. చేతి కంకణం ఉంటాయి. వాటిని అలంకరించుకుని ముల్లుగర్ర చేతబట్టుకుని బుల్లెట్ పై ఊళ్లోకి చైతూ బయల్దేరడం ఈ టీజర్ లో చూపించారు. అంటే కథాపరంగా ఈ సినిమాలో 'బంగార్రాజు' వారసుడిగా ఈ సినిమాలో చైతూ కనిపించనున్నాడనే విషయం అర్థమవుతోంది.