ఇంగ్లండ్ వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్.. కొవాగ్జిన్‌ను గుర్తించిన బ్రిటన్
- బ్రిటన్ అధికారికంగా గుర్తించిన టీకాల జాబితాలో చేరిన కొవాగ్జిన్
- ప్రయాణానికి ముందు ఇక పీసీఆర్ టెస్టుతో పనిలేనట్టే
- బ్రిటన్ చేరుకున్నాక మాత్రం రెండు రోజుల్లోపు పరీక్షలు చేయించుకోవాల్సిందే
బ్రిటన్ తాజా నిర్ణయంతో కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నవారు ప్రయాణానికి ముందు కరోనా నిర్ధారణ పీసీఆర్ టెస్టు చేయంచుకోకుండానే ఫ్లైట్ ఎక్కేయొచ్చు. అయితే, బ్రిటన్ చేరుకున్నాక మాత్రం రెండు రోజుల్లోపు పీసీఆర్/లాటరల్ ఫ్లో టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతులు (ఈయూఎల్) మంజూరు చేసిన టీకాలన్నింటికీ తాము గుర్తింపునిచ్చినట్టు బ్రిటన్ రవాణాశాఖ తెలిపింది. ఫలితంగా కొవాగ్జిన్, సినోవాక్, సినోఫార్మ్‌కు అనుమతి లభించింది.