వేధిస్తున్న తండ్రి.. స్నేహితులతో కలిసి మట్టుబెట్టిన బాలిక

23-11-2021 Tue 07:59
  • చెప్పుకోలేని విధంగా కుమార్తెను హింసిస్తున్న తండ్రి
  • వేధింపుల నుంచి బయటపడేందుకు హతమార్చాలని నిర్ణయం
  • స్నేహితులతో కలిసి అర్ధరాత్రి మారణాయుధాలతో దాడి
Girl killed her father with the help of friends
తనను వేధించడమే పనిగా పెట్టుకున్న తండ్రిపై కక్ష పెంచుకున్న 17 ఏళ్ల బాలిక స్నేహితులతో కలిసి అతడిని మట్టుబెట్టింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బీహారుకు చెందిన దీపక్ కుమార్ సింగ్ (46) నగరంలోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం (జీకేవీ)లో భద్రతా విభాగంలో పనిచేస్తున్నాడు.  17 ఏళ్ల కుమార్తెను నిత్యం వేధించేవాడు. చెప్పుకోలేని స్థితిలో హింసించేవాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక తండ్రిపై కక్ష పెంచుకుంది.

వేధింపుల నుంచి బయటపడాలంటే తండ్రిని మట్టుబెట్టడమే మార్గమని నిర్ణయించింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు స్నేహితులను ఇంటికి పిలిపించింది. అందరూ కలిసి మారణాయుధాలతో దీపక్ సింగ్‌పై దాడిచేసి పరారయ్యారు. దాడి సమయంలో ఆమె ఇద్దరు చెల్లెళ్లు కూడా అక్కడే ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న బాలిక, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.