పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్... మరో రెండు వారాల్లో కేంద్రం నిర్ణయం
- దేశంలో 100 కోట్ల డోసులు దాటిన వ్యాక్సినేషన్
- త్వరలో సమావేశం కానున్న సలహా సంఘం
- వచ్చే జనవరి నుంచి పిల్లలకు వ్యాక్సిన్లు
- బూస్టర్ డోసులపైనా చర్చించే అవకాశం
- ఇప్పటికే పలు దేశాల్లో అదనంగా మూడో డోసు
వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు 2022 జనవరి నుంచి, చిన్నారులు అందరికీ మార్చి నుంచి వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. ఇక, పలు దేశాల్లో రెండు డోసులు తీసుకున్న వారికి అదనంగా బూస్టర్ డోసు ఇస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.... ఆ దిశగా దృష్టి సారించింది.