Roja: రాజధానికి, రాజధాని రైతులకు సీఎం జగన్ వ్యతిరేకం కాదు: రోజా

  • వికేంద్రీకరణపై సీఎం జగన్ ప్రకటన
  • కొత్త బిల్లు తెస్తామని వెల్లడి
  • సీఎం జగన్ ప్రకటనను స్వాగతించిన రోజా
  • అందరి అభిప్రాయాలు తెలుసుకుని కొత్త బిల్లు తెస్తారని వెల్లడి
Roja said CM Jagan does not anti for capital and capital farmers

అధికార వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణపై ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్వాగతిస్తున్నట్టు తెలిపారు.

రాజధానికి, రాజధాని రైతులకు సీఎం జగన్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ ఒకేచోట అభివృద్ధి అంతా కేంద్రీకృతమైతే హైదరాబాద్ విషయంలో జరిగిందే ఏపీలోనూ జరుగుతుందేమోనన్న ఆలోచనతోనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని రోజా వివరించారు. ఇప్పటికే వెనుకబడి ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు మళ్లీ ఉద్యమానికి పూనుకుంటే రాష్ట్రంలో సమస్యలు వస్తాయని సీఎం గుర్తించారని తెలిపారు. అందుకే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.

కొత్త బిల్లు తెచ్చే క్రమంలో రైతులతోనూ, న్యాయస్థానాల్లో కేసులు వేసిన వారితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటారని రోజా వివరించారు. సమగ్రంగా అభిప్రాయాలు సేకరించి, ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగని రీతిలో విస్తృతస్థాయిలో చర్చించి అసెంబ్లీలో కొత్త బిల్లుతో వస్తారని వెల్లడించారు.

More Telugu News