'శ్యామ్ సింగ రాయ్' నుంచి సెకండ్ సింగిల్ రెడీ!

22-11-2021 Mon 18:08
  • విభిన్న కథా చిత్రంగా 'శ్యామ్ సింగ రాయ్'
  • కలకత్తా నేపథ్యంలో నడిచే కథ
  • ఈ నెల 25వ తేదీన సెకండ్ సింగిల్
  • డిసెంబర్ 24వ తేదీన సినిమా రిలీజ్  
Shyam Singha Roy second single will release in 25th November
మొదటి నుంచి కూడా కథాకథనాల పరంగా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్న నాని, ఈ సారి ఆ రెండింటితో పాటు లుక్ పరంగా కూడా డిఫరెంట్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయనను కొత్తగా ఆవిష్కరించే ఆ సినిమానే 'శ్యామ్ సింగ రాయ్'. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, వెంకట్ బోయినపల్లి నిర్మించాడు.

కలకత్తా నేపథ్యంలో .. చాలాకాలం క్రితం అక్కడ ఆచారం పేరుతో జరిగిన ఒక అరాచకం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ ద్వారా ఈ విషయమే అర్థమైంది. ఇక తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా నుంచి 'ఏదో .. ఏదో' అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు.

ఈ పాట నాని - కృతి శెట్టిపై చిత్రీకరించారనే విషయం, ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు. సాయిపల్లవి .. మడోన్నా సెబాస్టియన్ కూడా ఈ సినిమాలో కథానాయికలుగానే సందడి చేయనున్నారు.