'దృశ్యం 2' నుంచి లిరికల్ వీడియో సాంగ్!

22-11-2021 Mon 17:08
  • 'దృశ్యం' సీక్వెల్ గా 'దృశ్యం 2'
  • అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ 
  • ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ 
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
Drushyam lyrical video song released
తెలుగునాట 'దృశ్యం' సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'దృశ్యం 2' సినిమా రూపొందింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"ఎన్నో కలలు కన్నా .. అన్నీ కలతలేనా .. చుట్టూ వెలుతురున్నా .. నాలో చీకటేనా " అంటూ ఈ పాట సాగుతోంది. సినిమాలో ఒక తల్లిగా మీనా పాత్ర చెందే ఆవేదనకి అక్షర రూపమే ఈ పాట. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా, శ్రేయ ఘోషల్ ఆలపించింది.

సినిమాలో సన్నివేశాల్లోని బలానికి .. బరువైన భావాలకి .. మానసిక సంఘర్షణకి తగిన పదాలు పడ్డాయి. శ్రేయ ఘోషల్ స్వరం ఈ పాటను మరింతగా ప్రేక్షకుల మనసుల దగ్గరికి మోసుకు వెళ్లేదిలా ఉంది. మలయాళంలో మొదటి భాగానికి మించిన రెస్పాన్స్ రెండవ భాగానికి వచ్చింది. ఇక్కడ కూడా అదే స్థాయి రిజల్ట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.